తెలంగాణ సీనియర్ ఐఏఎస్ అధికారి జయేష్ రంజన్ వీఆర్‌ఎస్‌కు దరఖాస్తు చేసుకున్నట్లు వస్తున్న వార్తలు చర్చనీయాంశంగా మారాయి. 2027 సెప్టెంబరులో పదవీ విరమణ చేయాల్సి ఉండగా.. ముందుగానే సర్వీసు నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. అమెరికాకు చెందిన ప్రముఖ సంస్థలో ఉన్నతస్థాయి ఉద్యోగ అవకాశం రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే జయేష్ రంజన్ వీఆర్‌ఎస్ ఆమోదం, కొత్త ఉద్యోగంలో చేరికపై అధికారిక స్పష్టత రావాల్సి ఉంది.