రైతులకు గుడ్‌న్యూస్‌.. 12 జిల్లాల్లో ఏఐ భూసార పరీక్ష ల్యాబ్‌లు, పంట మార్పులకు ఏఐ సాయం

2 hours ago 1
తెలంగాణలో రైతులకు భూసార పరీక్షలను మరింత చేరువ చేసేందుకు 12 జిల్లాల్లో ఏఐ ఆధారిత డిజిటల్‌ సాయిల్‌ టెస్టింగ్‌ ల్యాబ్‌లను ఏర్పాటు చేయాలని ఆచార్య జయశంకర్‌ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం నిర్ణయించింది. ఇఫ్కో ఆర్థిక సహకారంతో రైతు విజ్ఞాన కేంద్రాల్లో ఈ ప్రయోగశాలలను ఏర్పాటు చేయనున్నారు. ఒక్కో ల్యాబ్‌కు రూ.3.50 లక్షలు ఖర్చు చేయనున్నారు. ప్రతి కేంద్రం నెలకు 2 వేల నమూనాలను పరీక్షించే సామర్థ్యంతో ఉంటుంది. దీంతో రాష్ట్రంలో నెలకు అదనంగా 24 వేల నమూనాల పరీక్ష సామర్థ్యం అందుబాటులోకి రానుంది.
Read Entire Article