రైలు ప్రయాణికులకు వాల్తేరు డివిజన్ గుడ్ న్యూస్ చెప్పింది. రైలు ప్రయాణికుల కోసం రైళ్లల్లో టీ. కాఫీ వెండింగ్ యూనిట్లను తీసుకువచ్చింది. సుదూర ప్రాంతాలకు వెళ్లే రైళ్లలో నాణ్యమైన టీ, కాఫీ కొరతను తీర్చేందుకు అధునాతన వెండింగ్ యూనిట్లు ఏర్పాటు చేసింది. విశాఖపట్నం - న్యూఢిల్లీ ఏపీ ఎక్స్‌ప్రెస్‌లో తొలుత ఈ సేవలు ప్రారంభించారు. డీఆర్ఎం లలిత్ బోహ్రో బుధవారం ఈ వెండింగ్ యూనిట్లను లాంఛనంగా ప్రారంభించారు. దీనిపై రైలు ప్రయాణికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.