ఏపీ ప్రజలకు, తెలుగు వారికి మాజీ మంత్రి, వైసీపీ నాయకురాలు ఆర్కే రోజా భోగి శుభాకాంక్షలు తెలిపారు. తెలుగు ప్రజలు భోగ భాగ్యాలతో, ఆరోగ్యంతో ఎల్లప్పుడూ సుఖశాంతులతో సంతోషంగా ఉండాలని ఆకాంక్షించారు. సుదూర ప్రాంతాల నుంచి తరలివచ్చి సంక్రాంతి లాంటి పండుగులు జరుపుకోవడం వల్ల మనకు తెలియని, దూరపు బంధువులు కూడా తెలిసే అవకాశం ఉందన్నారు. నగరిలో కుటుంబసభ్యులు, బంధువులతో కలిసి భోగి మంటలు వేసి పండుగ జరుపుకుంటున్నందుకు సంతోషంగా ఉందన్నారు. దీని వల్ల భవిష్యత్ తరాలకు మన పండుగ, సంస్కృతి, సంప్రదాయాలు తెలుస్తాయని రోజా పేర్కొన్నారు.