హైదరాబాద్ మేడిపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో లోన్ యాప్ నిర్వాహకుల వేధింపులు కలకలం రేపాయి. బోడుప్పల్‌కు చెందిన ఓ మహిళ బంధువు అవసరాల కోసం తీసుకున్న రుణానికి ఈఎంఐ చెల్లించలేకపోయింది. దీంతో నిర్వాహకులు వరుస ఫోన్‌కాల్స్‌తో వేధించారు. నంబర్లు బ్లాక్ చేసినా ఇతర నంబర్ల నుంచి కాల్స్ కొనసాగించారు. చివరకు బాధితురాలి పదో తరగతి చదువుతున్న కుమార్తె ఫొటోలను అసభ్యకరంగా మార్ఫింగ్ చేసి వాట్సాప్‌లో పంపించారు. డబ్బు చెల్లించకపోతే సోషల్ మీడియాలో వైరల్ చేస్తామని బెదిరించారు. దీంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.