వన్‌వేతోనే KBR ట్రాఫిక్‌కు చెక్‌.. రూ.1,090 కోట్ల ప్రాజెక్టుపై జీహెచ్‌ఎంసీ పునరాలోచన..?

1 hour ago 1
హైదరాబాద్ కేబీఆర్‌ పార్కు చుట్టూ ట్రాఫిక్‌ సమస్య పరిష్కారానికి రూ.1,090 కోట్లతో చేపట్టిన పైవంతెనలు, అండర్‌పాస్‌ల ప్రాజెక్టుపై జీహెచ్‌ఎంసీ పునరాలోచన చేస్తోంది. ఇటీవల అమలు చేస్తున్న వన్‌వే విధానంతో వాహనాల రాకపోకలు సాఫీ అయ్యాయి. దీంతో అవసరమైన పనులను మాత్రమే కొనసాగించి భారీ వ్యయాన్ని తగ్గించే అంశాన్ని అధికారులు పరిశీలిస్తున్నారు. అయితే ఇప్పటికే పిల్లర్లు, అండర్‌పాస్‌ పనులు ప్రారంభం కావడం, కాంట్రాక్టు ఒప్పందాలు, భూసేకరణ వ్యయం పెరగడం సవాళ్లుగా మారాయి. వన్‌వేతోపాటు లింక్‌ రోడ్ల విస్తరణపై కూడా దృష్టి పెట్టాలని భావిస్తున్నారు.
Read Entire Article