వాహన బీమా విధానంలో ఐఆర్‌డీఏఐ కీలక మార్పులు తీసుకొచ్చింది. డిసెంబరు 15 నుంచి నాలుగంచెల మోటారు బీమా విధానం అమల్లోకి రానుంది. థర్డ్‌పార్టీ లయబిలిటీ, ప్రయాణికులు–పిలియన్ రైడర్ల బీమా, వ్యక్తిగత ప్రమాద బీమా, సొంత వాహన నష్టం–చోరీ కవరేజీలుగా పాలసీని విభజించారు. ప్రతి కవరేజీకి సంబంధించిన ప్రీమియం వివరాలను విడిగా వెల్లడించాలి. వినియోగదారులు తమ అవసరాలకు అనుగుణంగా కవరేజీలను ఎంచుకోవచ్చు. కొత్త విధానాన్ని బీమా సుగమ్ డిజిటల్ వేదికతోనూ అనుసంధానించనున్నారు.