రాజధాని పరిధిలో అత్యంత ప్రాధాన్యత కలిగిన విజయవాడ నగరపాలక సంస్థకు త్వరలోనే ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం డివిజన్ల సంఖ్యను భారీగా పెంచింది. ప్రస్తుతం 64 ఉండగా.. కొత్తగా మరో 22 కలిపి మొత్తం 86కి పెంచింది. ఈ మేరకు సోమవారం గెజిట్ వెలువరించిన ప్రభుత్వం.. పెంపునకు కారణాలను వివరించింది. దీంతో పాటు రాష్ట్రంలోని 12 కార్పొరేషన్లు, 29 మున్సిపాల్టీలు సహా 41 చోట్లు సెప్టెంబరు 22 ఓటర్ల జాబితాను ప్రచురిస్తారు.