Vijayawada Telangana Man Try To Open Fire On Police: విజయవాడలో కలకలం రేగింది.. పోలీసులపై ఓ వ్యక్తి గన్‌తో కాల్పులు జరిపేందుకు ప్రయత్నించాడు. పోలీసులు, ఈగల్ టీమ్ విజయవాడలో తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో ఓ లాడ్జి దగ్గర అనుమానాస్పదంగా ఉన్న వ్యక్తిని గుర్తించి ప్రశ్నించారు. ఇంతలో అతడు పోలీసులపైకి గన్‌తో కాల్పులు జరిపేందుకు ప్రయత్నించాడు. అయితే పోలీసులకు ప్రమాదం తప్పింది.. అతడ్ని పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.