సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ విజయశాంతి రెడ్డి కుటుంబం ఆత్మహత్య కేసులో మరో పరిణామం చోటుచేసుకుంది. ఈ ఘటనలో తమపై కొన్ని యూట్యూబ్ ఛానెళ్లు తప్పుడు కథనాలు ప్రసారం చేస్తున్నాయంటూ విజయారెడ్డి సోదరుడు చిరంజీవి ఆరోపించారు. ఈ నేపథ్యంలో ఆయా ఛానెళ్లపై చర్యలు తీసుకోవాలని కోరుతూ మేడిపల్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడానికి వచ్చారు. అయితే కోర్టును ఆశ్రయించాలని పోలీసులు సూచించడంతో.. ఆయా ఛానెళ్ల మీద పరువు నష్టం దావా వేయనున్నట్లు చిరంజీవి మీడియాకు వెల్లడించారు.