ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తన ఆరోగ్య రహస్యాన్ని వెల్లడించారు. అసెంబ్లీలో మాట్లాడిన ఆయన రోజూ ఓ పూట చేపలు లేదా రొయ్యలు తింటానని చెప్పారు. ప్రతి ఒక్కరూ భోజనంలో ఆక్వా ఉత్పత్తులను భాగం చేసుకోవాలని సూచించారు. చికెన్ కంటే చేపలలోనే ప్రోటీన్లు ఎక్కువగా ఉంటాయని.. ఎమ్మెల్యేలు కూడా ఈ డైట్ ఫాలో కావాలని సూచించారు. మరోవైపు స్కూళ్లు, కాలేజీలలో అందించే మధ్యాహ్న భోజనంలో వీటిని ప్రవేశపెట్టే ఆలోచనలో ఉన్నట్లు తెలిపారు.