బాలీవుడ్‌లో స్టార్‌డమ్ సాధించడం అనేది ఎంతో కష్టతరమైన ప్రయాణం. అనేక మంది నటీనటులు తమ కలలను సాకారం చేసుకోవడానికి చదువు, ఉద్యోగాలు వదిలిపెట్టి, చిన్న చిన్న పనులు చేస్తూ ముందుకు సాగుతారు. అలాంటి ఓ స్ఫూర్తిదాయక కథ.. శ్రద్ధా కపూర్‌ది. బాలీవుడ్‌లో ఐకానిక్ విలన్‌గా పేరుగాంచిన శక్తి కపూర్ కుమార్తె అయిన శ్రద్ధా, ఒకప్పుడు కాఫీ తయారు చేస్తూ, సాండ్‌విచ్‌లు అమ్ముతూ తన ప్రయాణాన్ని ప్రారంభించింది. ఈ రోజు ఆమె భారతీయ సినిమా పరిశ్రమలో అగ్రస్థానంలో ఉంది.