Tirumala Geetu Royal Reels: తిరుమలలో మరోసారి నిబంధనల ఉల్లంఘించారు. బిగ్‌బాస్ ఫేమ్ గీతూ రాయల్ అండ్ టీం తిరుమల శ్రీవారి ఆలయం ముందు రీల్స్ చేశారు. సినిమా పాటకు డ్యాన్సులు చేశారు.. ఆ రీల్‌ను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ రీల్ వైరల్ కావడంతో గీతూ రాయల్ వివాదంలో చిక్కుకున్నారు. టీటీడీ తిరుమలలో రీల్స్, వీడియోలు, ఫోటోషూట్‌లను నిషేధించిన సంగతి తెలిసిందే. అయినా సరే కొందరు మాత్రం రీల్స్ చేస్తూనే ఉన్నారు.