స్టార్ షట్లర్ పీవీ సింధు.. ఈ ఏడాది తాను బతుకమ్మ వేడుకలను చాలా మిస్ అవుతున్నానంటూ గతేడాది ఫోటోలను ఆమె పోస్ట్ చేశారు. భర్తతో కలిసి జరుపుకున్న మొదటి బతుకమ్మ వేడుకల ఫోటోలను ఇన్స్టాగ్రామ్లో ఆమె పంచుకున్నారు. అయితే, ఆ ఫోటోలలో ఒక దాంట్లో వెండితో చేసిన బతుకమ్మను చేతులో పట్టుకున్నారు. దీంతో కొందరు బతుకమ్మ అంటే పూలతో చేస్తారని, బంగారం, వెండితో కాదని విమర్శలు చేశారు. ఈ విమర్శలకు ఆమె తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు. ఏదైనా అనే ముందు సంప్రదాయాన్ని అర్ధం చేసుకోవాలని అన్నారు.