తెలంగాణ ప్రభుత్వం తన నిర్ణయాన్ని మార్చుకుంటూ.. టీ-హబ్ (T-Hub) కేవలం స్టార్టప్‌ల కేంద్రంగానే కొనసాగుతుందని స్పష్టం చేసింది. అద్దె భారాన్ని తగ్గించుకునేందుకు కొన్ని ప్రభుత్వ కార్యాలయాలను టీ-హబ్‌లోకి మార్చాలని అధికారులు భావించినా.. దీనిపై విమర్శలు రావడంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా నుండి స్పందించారు. అంకుర సంస్థల కోసం కేటాయించిన ఈ భవనంలో ఇతర ప్రభుత్వ ఆఫీసులు ఉండకూడదని ఆయన అధికారులను ఆదేశించారు. టీ-హబ్ ప్రాంగణంలోని ప్రతి అంగుళం ఇన్నోవేషన్ కోసం మాత్రమే వినియోగించాలని.. అద్దె భవనాల్లోని కార్యాలయాలను ఇతర ప్రభుత్వ బిల్డింగుల్లోకి తరలించాలని సూచించారు.