Supreme Court Ys Jagan Assets Case: జగన్ ఆస్తుల కేసులపై దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారణ జరిపింది. జగన్ ఆస్తుల కేసులకు సంబంధించిన పూర్తి వివరాలు రెండు వారాల్లో అందించాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. కింది కోర్టులో ఉన్న డిశ్చార్జ్ పిటిషన్ల వివరాలు అందించాలని ధర్మాసనం కోరింది. తెలంగాణ హైకోర్టులో ఉన్న పెండింగ్ అప్లికేషన్ల వివరాల అందించాలని సీబీఐ, ఈడీలను ఆదేశించింది. ఈ కేసులు వివరాలు విడివిడిగా అందించాలని అన్ని వివరాలతో రెండు వారాల్లో దాఖలు చేయాలని ఆదేశించింది.