Butta Renuka Couple Assets For Auction: మాజీ ఎంపీ బుట్టా రేణుక, ఆమె భర్త నీలకంఠ ఆస్తులు వేలం వేయనున్నారు. ఈ మేరకు ఎల్‌ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ ప్రకటనను జారీ చేసింది. 2018లో తీసుకున్నరూ.340 కోట్లు రుణం కాస్త రూ.782.07 కోట్ల వరకు పెరిగింది. ఈ క్రమంలో రుణం తిరిగి చెల్లించలేకపోవడంతో బుట్టా దంపతుల ఆస్తుల్ని వేలం వేయాలని ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ నిర్ణయం తీసుకుంది.