నెల రోజుల వ్యవధిలో నకిలీ కరెన్సీ నోట్లను రెండుసార్లు శంషాబాద్ పరిధిలో పట్టుబడ్డాయి. ఆదివారం ఉదయం ఓ యువకుడి నుంచి రూ.1.34 లక్షల విలువైన నోట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తాను ఓ మహిళ సూచనలతోనే ఈ నోట్లను గుర్తుతెలియని వ్యక్తికి అందజేయడానికి వచ్చినట్టు అతడు చెప్పాడు. గత నెలలోనూ దాదాపు రూ.3 లక్షల విలువైన ఫేక్ కరెన్సీ పట్టుబడగా.. ముగ్గురు వ్యక్తులను పోలీసులను అదుపులోకి తీసుకుని ప్రింటింగ్ మిషన్ స్వాధీనం చేసుకున్నారు.