జైలు గోడల మధ్య చదువును కొనసాగించిన తెలంగాణకు చెందిన 10 మంది ఖైదీలు ఉన్నత విద్యలో అరుదైన ఘనత సాధించారు. హైదరాబాద్‌లో జరిగిన డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ 27వ స్నాతకోత్సవంలో వారు పీజీ పట్టాలు అందుకున్నారు. వీరిలో ఎనిమిది మంది ఎంఎస్సీ సైకాలజీ, ఇద్దరు ఎంఏ సోషియాలజీ పూర్తి చేశారు. జైలు శిక్ష అనుభవిస్తూనే ఉన్నత విద్యను అభ్యసించిన వీరి ప్రయాణం ఎందరికో స్ఫూర్తిగా నిలిచింది. ఖైదీలు సమయాన్ని సద్వినియోగం చేసుకుని చదువు, నైపుణ్యాలను అభివృద్ధి చేసుకునేలా జైళ్ల శాఖ ప్రోత్సహిస్తోంది.