తెలంగాణ ప్రభుత్వం త్వరలో 14 వేలకు పైగా అంగన్‌వాడీ టీచర్లు, హెల్పర్ల (Helpers) నియామక ప్రక్రియను చేపట్టనుంది. ఈ విషయాన్ని మంత్రి సీతక్క తాజాగా ప్రకటించారు. నిరుద్యోగ మహిళలకు ఇది శుభవార్త అనే చెప్పాలి. కొత్తగా నియమితులైన గ్రేడ్-1 సూపర్‌వైజర్లకు నియామక పత్రాలు అందించిన సందర్భంగా మంత్రి ఈ ప్రకటన చేశారు. అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా పౌష్టికాహారం, ప్రాథమిక విద్య అందించడంలో సూపర్‌వైజర్లు, హెల్పర్ల పాత్ర కీలకమని ఆమె సూచించారు.