మిర్చి రైతులు, ఎగుమతిదారులు ఎదుర్కొంటున్న సమస్యపై సీఎం చంద్రబాబునాయుడు చొరవ తీసుకున్నారు. శ్రీలంక కొలంబో పోర్టులో నిలిచిపోయిన మిర్చి కంటైనర్లను త్వరగా ఇక్కడ రప్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా కేంద్రానికి లేఖ రాశారు. మిర్చి తేమ విషయంలో నిర్దేశిత ప్రమాణాలను పాటించ లేదనే కారణంతో అక్కడ కంటైనర్లను నిలిపివేశారు. దీంతో సుమారు రూ.60 కోట్ల విలువైన భారీ మిర్చి సరుకు ఎటూ కదల్లేక పోర్టులోనే ఉండిపోయింది.దీంతో మిర్చి రైతులు, ఎగుమతుదారులు, వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు.