చిన్నారుల తల్లిదండ్రులకు తిరుమల తిరుపతి దేవస్థానం మంచి అవకాశం కల్పిస్తోంది. శ్రీవారి సన్నిధిలో చిన్నారులకు అక్షరాభ్యాసం, అన్నప్రాశన నిర్వహించుకునే సదుపాయం కల్పిస్తోంది. అక్షర గోవిందం పేరుతో జూలై మూడో తేదీ నుంచి ఈ కార్యక్రమం ప్రారంభించనున్నట్లు టీటీడీ తెలిపింది. ఆసక్తి గల తల్లిదండ్రులు వకుళామాత ఆలయానికి గంట ముందుగా చేరుకుని నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. కార్యక్రమంలో భాగంగా టీటీడీ ఉచితంగా కిట్లు కూడా అందించనుంది.