ఆధ్యాత్మిక క్షేత్రం శ్రీశైలంలో కలకలం రేగింది. ఆలయ సమీపంలోని రోడ్డుపై బాంబులు, బుల్లెట్లు కనిపించాయి. ఓ సంచి అనుమానంగా కనిపించడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని అనుమానాస్పద సంచిని పరిశీలించగా.. అందులో బాంబులు, బుల్లెట్లు కనిపించాయి. 9 పెద్దసైజు బుల్లెట్లు, 4 చిన్నసైజు బుల్లెట్లతో పాటుగా.. నాలుగు బాంబులను పోలీసులు గుర్తించారు. వెంటనే పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అయితే అవి అక్కడకు ఎలా వచ్చాయనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు.