సినిమాల్లో రొమాంటిక్ హీరోగా, బాక్సాఫీస్ రారాజుగా వెలుగొందుతున్న షారుఖ్ ఖాన్ (Shah Rukh Khan) గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న ఈ బాద్‌షా.. వెండితెరపైనే కాదు, ఒకప్పుడు చదువులోనూ రారాజే అని తాజాగా బయటపడింది.