సంక్రాంతి పండుగకు సొంతూర్లకు వెళ్లేవారితో రైల్వేస్టేషన్లు, బస్టాండ్లు కిటకిటలాడుతున్నాయి. అదనపు బస్సులు, ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసినప్పటికీ బస్సులు పూర్తిగా నిండిపోతున్నాయి. పెద్ద పండుగను సొంతూర్లలో జరుపుకోవాలనే ఆశతో పట్నం వాసులు.. పల్లెకు పరుగులు పెడుతున్నారు. దీంతో విపరీతమైన రద్దీ నెలకొంది. ఈ నేపథ్యంలో ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు రవాణా శాఖ అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ప్రధాన పట్టణాల నుంచి పల్లెలకు ప్రజలను తరలించేందుకు ప్రైవేట్ స్కూళ్లు, కాలేజీల బస్సులను ఉపయోగించుకోవాలని సూచించారు. ఫిట్‌నెస్ పరీక్షలు నిర్వహించి.. ప్రయాణికుల తరలింపు కోసం ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.