సంక్రాంతి పండుగ వేళ ఆంధ్రప్రదేశ్‌లో.. ముఖ్యంగా గోదావరి జిల్లాల్లో కోడి పందేలు జోరుగా సాగుతున్నాయి. స్థానికులతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి పందెం అభిమానులు తరలివస్తున్నారు. ఈ క్రమంలో బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో జరిగిన కోడి పందేలకు విదేశీయులు కూడా వచ్చారు. సఖినేటిపల్లిలో నిర్వహించిన బరుల్లో కోడి పందేలను ఆస్ట్రేలియా దేశీయులు ఆసక్తిగా తిలకించారు. అనంతరం పందెం కోళ్లతో ఫొటోలకు ఫోజులిచ్చారు.