ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఇంట్లో ఒక్కరికి ప్రభుత్వం ఉద్యోగం రావడమే గొప్ప విషయంగా భావిస్తున్నారు. అలాంటిది ఓ ఇంట్లో ఐదుగురు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించారు. సంగారెడ్డి జిల్లా రాయికోడ్కు చెందిన రాఘవరెడ్డి, శోభమ్మ దంపతుల నలుగురు కూతుర్లు, కుమారుడు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించారు. కాగా తండ్రి రిటైర్ట్ పోస్ట్ మాస్టర్ కావడం గమనార్హం.