సగం ధరకే వాహనాలు.. ట్రాక్టర్స్, రాయల్ ఎన్ఫీల్డ్ కూడా.. రూ.1.50 కోట్లు వసూలు చేసి దెబ్బేశాడు..

1 month ago 5
జోగులాంబ గద్వాల జిల్లాలో తక్కువ కాలంలో డబ్బు రెట్టింపు చేస్తామంటూ పాస్టర్ వసంత్ చేసిన ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది. పది వేలు కడితే ఇరవై వేలు ఇస్తామని.. సగం ధరకే ట్రాక్టర్లు, బైక్‌లు ఇప్పిస్తానని నమ్మించి గోనుపాడు, మార్లబీడు తదితర గ్రామాల ప్రజల నుండి సుమారు కోటిన్నర రూపాయలు వసూలు చేశాడు. నెలలు గడుస్తున్నా హామీ నెరవేర్చకపోవడంతో బాధితులు నిలదీయగా ఆయన పరారయ్యాడు. ఇటీవల తిరిగి గద్వాలకు వచ్చిన నిందితుడిని బాధితులు నిలదీసినా ఫలితం లేకపోవడంతో గద్వాల సీఐకి ఫిర్యాదు చేశారు.
Read Entire Article