టాలీవుడ్ స్టార్ నటి సమంత, దర్శకుడు రాజ్ నిడిమోరు వివాహం సినీ వర్గాల్లో అత్యంత చర్చనీయాంశంగా మారింది. కోయంబత్తూర్‌లోని ఈశా యోగా ఆశ్రమంలో, పూర్తి ఆధ్యాత్మిక వాతావరణంలో, అతి తక్కువ మంది అతిథుల సమక్షంలో జరిగిన ఈ వేడుక ప్రతీ అంశం ప్రత్యేకతను సంతరించుకుంది.