ఏపీ మున్సిపల్ పోరు వేళ చిత్ర విచిత్రాలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా తిరుపతిలో ఓ వినూత్న ఘటన అందరినీ ఆశ్చర్యపరిచింది. చిగురువాడ గ్రామానికి చెందిన సుభద్ర స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసేందుకు 6000 రూపాయి కాయిన్స్‌తో వెళ్లారు. ఆ రూపాయి నాణేలను చూసిన అధికారులు వివరాలు అడగగా.. తమ ఊరికి న్యాయం జరగలేదని.. గ్రామస్థులంతా ఒక్కో రూపాయి చొప్పున చందా ఇచ్చారని ఆ డబ్బుతోనే నామినేషన్ వేయడానికి వచ్చానని సుభద్ర చెప్పారు. గ్రామస్థులు వ్యవస్థపై నిరసనను ఇలా రూపాయి నాణేలతో చూపించారు.