తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల నగారా మోగింది. ఐదు దశల్లో సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించనుండగా.. ఈ మేరకు ఎస్‌ఈసీ షెడ్యూల్ విడుదల చేసింది. అక్టోబర్ 9న నోటిఫికేషన్.., నామినేషన్లు ప్రారంభమై నవంబర్ 11తో ఎన్నికల ప్రక్రియ ముగుస్తుంది. నేటి నుంచి ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది.