'సావే సచ్చిపోయింది నా బిడ్డను సంపలేక'.. గూస్‌బంప్స్ తెప్పిస్తున్న రష్మిక మందన్నా 'మైసా'..!

2 months ago 5
రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'మైసా'. రవింద్ర పుల్లె దర్శకత్వం వహిస్తున్న సినిమా ఫస్ట్ గ్లింప్స్‌ను మేకర్స్ తాజాగా రిలీజ్ చేశారు. 'నా బిడ్డ సచ్చిందన్నారు.. కానీ మట్టే వణికిపోయింది నా బిడ్డ రక్తాన్ని దాసలేక. గాలే ఆగిపోయింది నా బిడ్డ ఊపిరి మోయలేక. అగ్గే బూడిదైపోయింది మండుతున్న నా బిడ్డను చూడలేక.. ఆఖరికి సావే సచ్చిపోయింది నా బిడ్డను సంపలేక.. నా బిడ్డ ఎవరో తెలుసా? మైసా అంటూ.. రోమాలు నిక్కబొరుచుకునేలా ఉంది గ్లింప్స్. రష్మిక మాత్రం పీక్స్ అంతే. ఇప్పటివరకు ఆమె చేసిన రోల్స్ ఎలాంటివో పక్కన పెడితే.. మైసా మాత్రం తన కెరీర్‌లోనే ది బెస్ట్ రోల్ అవుతుందని ఒక్క గ్లింప్స్‌తో క్లారిటీ వచ్చేసింది. ఈ సినిమాను అన్‌ఫార్ములా ఫిల్స్ నిర్మిస్తుంది.
Read Entire Article