అంబేద్కర్ కోనసీమ జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. సిగరెట్ కోసం జరిగిన గొడవ చిలికి చిలికి గాలివానలా మారి.. ఓ నిండుప్రాణం తీసింది. కోనసీమ జిల్లా మండపేటలో వీరబాబు, సురేష్ అనే ఇద్దరు వ్యక్తుల మధ్య సిగరెట్ కోసం గొడవ జరిగింది. ఈ గొడవ కాస్తా ఘర్షణగా మారి.. వీరబాబుపై సురేష్ దాడి చేశాడు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన వీరబాబు.. మండపేట ప్రభుత్వ ఆస్పత్రిలో చనిపోయాడు. ఘటన తర్వాత నిందితుడు పరారీ కాగా.. పోలీసులు గాలిస్తున్నారు. మరోవైపు గంజాయి మత్తులోనే గొడవ జరిగిందని స్థానికులు చెప్తున్నారు.