‘సీజ్ చేసిన నా ఆటో ఇవ్వకపోతే.. పామును వదులుతా’.. ట్రాఫిక్ పోలీసులను బెదిరించిన డ్రైవర్..

2 months ago 6
హైదరాబాద్‌ చాంద్రాయణగుట్టలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో వింత ఘటన చోటుచేసుకుంది. మద్యం మత్తులో ఆటో నడుపుతున్న ఓ డ్రైవర్‌ను పోలీసులు ఆపగా.. పరీక్షలో రీడింగ్ 150 రావడంతో ఆటోను సీజ్ చేశారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన డ్రైవర్.. ఆటోలో ఉన్న తన సామగ్రి తెచ్చుకుంటానని చెప్పి లోపలి నుంచి ఒక పామును తీశాడు. ఆ పామును చేతికి చుట్టుకుని పోలీసులను బెదిరిస్తూ హల్‌చల్ చేశాడు. అప్రమత్తమైన పోలీసులు అతడిని పట్టుకునే ప్రయత్నం చేయగా.. ఆ గందరగోళంలో పాముతో సహా పరారయ్యాడు. విధుల్లో ఉన్న పోలీసులను భయపెట్టడం, మద్యం తాగి వాహనం నడపడంపై అధికారులు కఠిన చర్యలకు సిద్ధమవుతున్నారు. ఈ వింత చేష్టలు ఇప్పుడు నగరంలో చర్చనీయాంశంగా మారాయి.
Read Entire Article