ఇటీవల తిరుపతిలో చోటుచేసుకున్న తొక్కిసలాట ఘటన తర్వాత శ్రీవారి ఆలయం గురించి అనేక వదంతులు సోషల్ మీడియా వేదికగా వ్యాపిస్తున్నాయి. ఇదే సమయంలో టీటీడీ ఛైర్మన్, ఈఓల మధ్య పొసగడం లేదనే ప్రచారం సాగిస్తున్నాయి. దీనిపై తాజాగా ఇరువురు కలిసి మీడియా ముందుకు వచ్చారు. ఇలాంటి వార్తలు చాలా బాధాకరమని ఛైర్మన్ బీఆర్ నాయుడు అన్నారు. తిరుమలలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు.