Mehdipatnam Skywalk: హైదరాబాద్‌లోని మెహిదీపట్నం స్కైవాక్ త్వరలో ప్రజలకు అందుబాటులోకి రానుంది. నిత్యం రద్దీగా ఉండే ఈ జంక్షన్‌లో పాదచారుల భద్రత కోసం నిర్మిస్తున్న ఈ స్కైవాక్ నిర్మాణం దాదాపు పూర్తి కావొచ్చిందని.. చిన్న చిన్న పనులు మాత్రమే మిగిలి ఉన్నాయని అధికారులు తెలిపారు. ఈ స్కైవాక్ ఆధునిక సౌకర్యాలతో పాటు వాణిజ్య అవసరాలకు కూడా ఉపయోగపడనుంది. ఫిబ్రవరి చివరిలో లేదా మార్చిలో ప్రారంభమయ్యే ఈ ప్రాజెక్ట్, నగరవాసులకు కొత్త అనుభూతిని అందించనుంది.