తెలంగాణ ప్రభుత్వం రిజిస్ట్రేషన్ మార్కెట్ ధరలు పెంచడానికి సిద్ధమవుతోంది. హైదరాబాద్ ఓఆర్ఆర్, RRR మధ్య ప్రాంతాలపై ఈ పెంపు ప్రధానంగా ఉంటుంది. అపార్ట్‌మెంట్లపై 30 శాతం, ఖాళీ స్థలాలపై వంద శాతం లేదా అంతకంటే ఎక్కువ పెరుగుదల ఉండవచ్చు. ఇది ప్రభుత్వ ఆదాయాన్ని పెంచుతుంది.. కానీ గృహ కొనుగోలుదారులకు ఆర్థిక భారం అవుతుంది. ఈ నిర్ణయం రియల్ ఎస్టేట్ మార్కెట్‌ను ప్రభావితం చేసే అవకాశం ఉంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.