స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఫోకస్ పెట్టారు. స్థానిక ఎన్నికల్లో జనసైనికుల ఆత్మగౌరవం నిలబెడతామన్నారు పవన్ కళ్యాణ్. గురువారం రోజున జనసేన శాసనసభాపక్ష సమావేశం జరిగింది. ఈ సందర్భంగా స్థానిక ఎన్నికలతో పాటుగా పలు రాజకీయ అంశాలపై పవన్ కళ్యాణ్ నేతలతో చర్చించారు. ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.