అసెంబ్లీ గేటు వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు వ్యవహారం తీవ్ర వివాదానికి దారితీసింది. నల్ల టీషర్ట్ ధరించి అసెంబ్లీలోకి వెళ్లేందుకు ప్రయత్నించిన ఆయనను పోలీసులు అడ్డుకోవడంతో వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ సందర్భంగా పోలీసులపై తాతా మధు అనుచిత వ్యాఖ్యలు చేశారని.. స్పీకర్ గడ్డం ప్రసాద్‌ను కూడా దూషించేలా మాట్లాడారని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. దీనిపై మంత్రి సీతక్క తీవ్రంగా స్పందిస్తూ తాతా మధు ఎమ్మెల్సీ సభ్యత్వాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంపై సీఎం రేవంత్ రెడ్డి ఆరా తీసినట్లు సమాచారం.