హాస్టల్ విద్యార్థులకు ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. విద్యార్థులకు అందించే డైట్ ఛార్జీలను పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పెరిగిన ఛార్జీలు అక్టోబర్ 1, 2026 అంటే గురువారం నుంచి అమల్లోకి వచ్చాయి. పెరిగిన డైట్ ఛార్జీలకు అనుగుణంగా స్టూడెంట్స్‌కు కొత్త మెనూను ప్రభుత్వం రెడీ చేసింది. ఇందులో భాగంగా వారంలో ఆరు రోజులు గుడ్లు.. మూడు రోజులు చికెన్.. ప్రతిరోజూ పాలు, పండ్లు అందించేలా మెనూను రూపొందించడం జరిగింది. వీటితో పాటు చికెన్ బిర్యానీ, చికెన్ కర్రీ, ఎగ్ కర్రీతో పాటు పులిహోర, ఇడ్లీ, ఉప్మా, పొంగల్ వంటి టిఫిన్లు కూడా మెనూలో ఉన్నాయి. వీటితో పాటు రాగి లడ్డూ, మల్టీ మిల్లెట్ చిక్కీలు, పండ్లను కూడా మెనూలో పొందుపరిచారు.