ప్రముఖ సింగర్ అదితి భావరాజు హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వనుంది. గ్రామీణ తెలంగాణ నేపథ్యంలో తెరకెక్కుతోన్న దండోరా సినిమాలో అదితి భావరాజు హీరోయిన్‌గా ఛాన్స్ కొట్టేసింది. కలర్ ఫొటో సినిమాను నిర్మించిన ప్రొడ్యూసర్ రవీంద్ర బెనర్జీ ముప్పనేని దండోరా మూవీని రూపొందిస్తున్నారు. పలు కీలక షెడ్యూల్స్ పూర్తి అయ్యాయి.