హైదరాబాద్‌ TGSRTC బస్సు ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. రూ.600తో వారం రోజులు అన్‌లిమిటెడ్ జర్నీ

1 hour ago 1
హైదరాబాద్‌ నగర ప్రయాణికుల కోసం టీజీఎస్‌ఆర్టీసీ రూ.600కే ఏడు రోజుల పాటు అపరిమిత సిటీ బస్సు ప్రయాణ సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో ఏసీ, నాన్‌ ఏసీ సిటీ బస్సుల్లో ఈ పాస్‌ వినియోగించుకోవచ్చు. అయితే.. పుష్పక్‌ ఎయిర్‌పోర్ట్‌ లైనర్‌ సర్వీసులకు ఇది వర్తించదు. మరోవైపు.. విమానాశ్రయానికి వెళ్లే పుష్పక్‌ ఏసీ బస్సుల ఛార్జీలను కూడా అక్టోబర్‌ 7 నుంచి తగ్గించారు. రోజువారీ ప్రయాణికుల ఖర్చులు తగ్గించడంతో పాటు ప్రజా రవాణా వినియోగాన్ని పెంచడం ఈ నిర్ణయాల లక్ష్యంగా అధికారులు తెలిపారు.
Read Entire Article