హైదరాబాద్‌కు విశేష అతిథి విచ్చేసింది. ఈ విశేష అతిథి ఆగమనంపై సీఎం రేవంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఇదంతా ఆ భగవంతుని ఆమోదమే అంటూ.. సీఎం రేవంత్ రెడ్డి ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేశారు. రేవంత్ రెడ్డి సర్కార్ తీసుకొచ్చిన హైడ్రా ద్వారా పునరుజ్జీవం సంతరించుకున్న అమీన్ పూర్ చెరువుకు.. అరుదైన పక్షి అతిథిగా విచ్చేసింది. శీతాకాలంలో ఐరోపా నుంచి దక్షిణాసియాకు వలస వచ్చే అరుదైన పక్షి అయిన రెడ్ బ్రెస్టెడ్ ఫ్లైక్యాచర్.. హైదరాబాద్‌కు రావటంపై సీఎం రేవంత్ రెడ్డి ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేశారు.