హైదరాబాద్ క్యూర్ పరిధిలో నిర్మించనున్న ఇందిరమ్మ ఇళ్ల టవర్స్‌కు భారీ స్పందన వచ్చింది. 16 నియోజకవర్గాల్లో నిర్మించే 7340 ఇళ్ల కోసం శనివారం వరకు 35,125 దరఖాస్తులు వచ్చినట్లు హౌసింగ్ బోర్డు వైస్ ఛైర్మన్ వి.పి. గౌతమ్ తెలిపారు. దరఖాస్తుల స్వీకరణ ఈ నెల 10 వరకు కొనసాగనుంది. ఆగస్టు 20న లాటరీ ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేయాలని ప్రాథమికంగా నిర్ణయించారు. ఏడాదిలోపు ఇళ్ల నిర్మాణం పూర్తిచేసి అందజేస్తామని అధికారులు తెలిపారు.