గచ్చిబౌలి అంజయ్యనగర్‌లో నిర్మాణం పూర్తి అయిన భవనం ఒక్కసారిగా కుప్పకూలింది. శనివారం మధ్యాహ్నం సమయంలో నిర్మాణం పూర్తి అయిన ఏడు అంతస్తుల భవనం కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో ఇద్దరు చనిపోయారు. ఈ ఘటనతో స్థానికులు భయంతో పరుగులు తీశారు. భవనం శిథిలాలు పక్కనే ఉన్న అపార్టుమెంట్ భవనంపైనా పడ్డాయి. మరోవైపు ఘటన గురించి సమాచారం అందుకున్న పోలీసులు, రెస్క్యూ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. శిథిలాల కింద ఉన్న రెండు మృతదేహాలను వెలికి తీశారు.