హైదరాబాద్ నుంచి మూడు హైస్పీడ్ ట్రైన్ మార్గాలు.. అలైన్‌మెంట్‌పై కేంద్రమంత్రులు కీలక ప్రకటన

1 hour ago 1
హైదరాబాద్‌–చెన్నై, హైదరాబాద్‌–బెంగళూరు, హైదరాబాద్‌–పుణె–ముంబయి హైస్పీడ్ రైలు కారిడార్లకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వాలకు ఇప్పటివరకు భూసేకరణ ప్రతిపాదనలు పంపలేదని కేంద్ర మంత్రులు అశ్వినీ వైష్ణవ్, జి.కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు. ఢిల్లీలో జరిగిన సమావేశంలో అలైన్‌మెంట్ అధ్యయనాల పురోగతి, తెలంగాణ రైతుల ఆందోళనలపై చర్చించారు. సూర్యాపేట మార్గంపై కూడా ప్రజలు తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారని కిషన్ ‌రెడ్డి తెలిపారు. అలైన్‌మెంట్లు ఖరారైన తర్వాతే రాష్ట్ర ప్రభుత్వాలకు, రైతులకు పూర్తి వివరాలు వెల్లడిస్తామని పేర్కొన్నారు. అధికారిక నిర్ణయానికి ముందే భూసేకరణ చేపడితే చట్టవిరుద్ధమవుతుందని స్పష్టం చేశారు.
Read Entire Article