హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు ఉత్తర భాగం పనులపై బిగ్ అప్డేట్. ఈ భాగంగా పనులను 5 నుంచి 2 ప్యాకేజీలకు ఎన్‌హెచ్‌ఏఐ కుదించినట్లు సమాచారం. పనులను రెండు ప్యాకేజీలుగా విభజించడంతో మరోసారి టెండర్లను ఆహ్వానించడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిసింది. ఇక ఇప్పటికే ఉత్తర భాగం రహదారికి జాతీయ రహదారి నెంబర్ (ఎన్‌హెచ్-161AA) కేటాయిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.