బార్ల లైసెన్స్‌ల కోసం భారీగా ఎగబడ్డారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలోని 41 బార్లకు ఏకంగా 8770 అప్లికేషన్లు వచ్చాయి. ఇక హైదరాబాద్‌లో అయితే మరింత డిమాండ్ వచ్చింది. నగరంలోని 14 బార్లకు 4,251 అప్లికేషన్లు వచ్చాయి. అందులో మొయినాబాద్‌లోని 2 బార్లకు 664 దరఖాస్తులు రావడం గమనార్హం. ఈ క్రమంలోనే తాజాగా బార్ల లైసెన్సులకు సంబంధించి ఎక్సైజ్ శాఖ డ్రా తీసి విజేతలను ఎంపిక చేసింది. ఇక బోధన్‌లోని ఒక బార్‌కు కేవలం 19 దరఖాస్తులు మాత్రమే వచ్చాయి.