హైదరాబాద్‌కు కొత్తగా వచ్చే వారి నివాస సమస్యను పరిష్కరించడానికి సైబరాబాద్ పోలీసులు ‘సేఫ్ స్టే’ ప్రాజెక్ట్‌లో భాగంగా ఒక వెబ్‌సైట్‌ను రూపొందిస్తున్నారు. ఈ వెబ్‌సైట్‌లో హాస్టళ్ల వివరాలు, ధరలు, సౌకర్యాలు.. భద్రతా సమాచారం ఉంటాయి. ఎస్‌సీఎస్‌సీ సర్వేలో బయటపడిన లోపాలను సరిదిద్దడానికి.. హాస్టళ్ల భద్రతను పెంపొందించడానికి ఈ ప్రయత్నం చేస్తున్నారు. హాస్టల్ యజమానులు .. పోలీసుల మధ్య సమన్వయం కోసం వాట్సాప్ గ్రూప్‌లు ఏర్పాటు చేస్తారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.