హైదరాబాద్‌లో ఎక్కడా చెత్త కనిపించకూడదు.. అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు

49 minutes ago 1
హైదరాబాద్ నగరాన్ని పరిశుభ్రంగా, ట్రాఫిక్ సమస్యలు లేని ప్రాంతంగా అభివృద్ధి చేయాలని సీఎం రేవంత్ రెడ్డి మున్సిపల్ అధికారులను ఆదేశించారు. ప్రతిరోజూ ఇంటింటికీ చెత్త సేకరణ జరగాలని, పారిశుధ్య నిర్వహణలో నిర్లక్ష్యం వహించే వారిపై చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. నిర్మాణ వ్యర్థాల తరలింపునకు ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేయాలని సూచించారు. మరోవైపు తాగునీటి వృథాను అరికట్టేందుకు పార్కులు, నిర్మాణ పనులకు ఎస్టీపీల్లో శుద్ధి చేసిన నీటిని అందించే గ్రీన్ ట్యాంకర్ల సేవలను విస్తరించాలని చెప్పారు. నగరంలో ట్రాఫిక్ రద్దీ తగ్గించేందుకు అండర్‌పాస్‌లు, ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణానికి ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు.
Read Entire Article